సినిమా ఇండస్ట్రీ భ్రష్టు పట్టిపోవడానికి ముఖ్య కారణం కొంతమంది హీరోల పైత్యమే. అరె.. టీ సప్లయ్ బాయ్ దగ్గర నుంచి కమెడియన్స్, హీరోయిన్ దాకా అన్నీ హీరోయే ఎంపిక చేస్తే ఇక డైరెక్టర్ ఏం చేయాలి ?, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకోండి, ఫలానా హీరోయిన్ని ఖాయం చేసుకోండి అని సజహంగా స్టార్ హీరోలు డిమాండ్ చేస్తుంటారు. కానీ, రవితేజ లాంటి సీనియర్ హీరో కూడా ప్రతీ దానిలో ఇన్ వాల్వ్ అయితే ఎలా? అని ఓ రచయిత తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించిన కొత్త చిత్రం `ధమాకా`. ఐతే, ఈ ధమాకా చిత్రంలో కొన్ని సీన్లు రీ టైట్ చేసి, రీ షూట్ చేస్తున్నారు. నిజానికి నక్కిన త్రినాథరావు నిర్మాత మంచి కోరుకునే డైరెక్టర్.
కానీ.. ఇక్కడ కథ అతనిది కాదు. ప్రసన్న కుమార్ బెజవాడది. అతనేం రాశాడో గానీ, రవితేజకి మాత్రం కొన్ని సీన్స్ నచ్చడం లేదు. అందుకే, ఓ కొత్త రైటర్ సహకారం కూడా తీసుకున్నారు. `కార్తికేయ 2`లో కొన్ని సన్నివేశాలకు రచనా సహకారం అందించిన రైటర్… ధమాకా కోసం ఓ వెర్షన్ రాసి ఇచ్చాడు. రవితేజకి ఇవి బాగా నచ్చాయి. నిజం చెప్పాలంటే.. ఈ కొత్త రైటర్ రవితేజ చెప్పింది, ఆయన నచ్చింది రాశాడు. సో.. కొత్తగా రాసిన ఆ సన్నివేశాల్ని మళ్లీ తీశారు. ఆ రకంగా ధమాకా కి రీషూట్లు తప్పలేదు. అసలు ఈ మధ్య రవితేజ సినిమా అంటే చాలు.. రీషూట్లు గ్యారంటీ అనే పరిస్థితి వచ్చేసింది.
అందుకే, సదరు రచయిత పెదవి విరుస్తున్నాడు. ‘ఈ రీషూట్ల బడ్జెట్ ఎవరు కేటాయించాలి ?, అప్పటికే ఖర్చు పెట్టి పెట్టి.. నిర్మాత విసిగిపోయి ఉంటాడు. ఆ విసుగులో ఈ రీషూట్లు అంటే నిర్మాత ఎలా తట్టుకోగలడు ?, అంటూ ఆ రచయిత `ధమాకా` నిర్మాత పై జాలి పడుతున్నాడు. ఇంతకీ ఆ రచయిత ఎవరంటే.. ఈ ధమాకాకి బాగా కావాల్సిన రచయితే. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంస్థల పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://www.instagram.com/p/CjVOf3fJkBu/?hl=te
ఇవి కూడా చదవండి…