ఓంకార్ అన్నయ్య..ఈజ్ బ్యాక్

226
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయిన ఓంకార్ వెండితెరపై దర్శకుడిగా రాణిస్తున్నాడు. రాజు గారి గది అనే హరర్ కామెడీ ట్రాక్ తో తొలి హిట్ కొట్టిన ఓంకార్ దీనికి సీక్వెల్ గా నాగార్జున తో రాజు గారి గది 2 చేశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించిన ఓంకార్ డైరెక్షన్ కి ప్రశంసలు లభించాయి.

అయితే తాజాగా మరోసారి బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. స్టార్ మా ఛానల్‌లో ‘సిక్త్స్ సెన్స్’ అనే కొత్త కార్యక్రమంతో బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు ఓంకార్. త్వరలో ప్రసారం కానుండగా ఈ షో ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా లాంఛ్ చేయించాడు ఓంకార్. ఐయాం బ్యాక్ అంటూ దర్శనం ఇచ్చిన ఓంకార్ తన క్రియేటివిటీ మొత్తం రంగరించి వదిలాడు.

 Star Maa all set to launch an exciting new Game show

ఇటు బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే ఈ సారి ట్రాక్ మార్చి ఓ క్లాసీ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమాను తెరకెక్కించనున్నాడు. ఓంకార్- బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ మాస్ అంశాలతో పాటు కామెడీ సన్నివేశాల నేపధ్యంతో రూపొందనున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా తనకు లైఫ్‌ ఇచ్చిన బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు ఓంకార్ అన్నయ్య.

- Advertisement -