బ్లాక్ డ్రెస్ లో స‌మంత హాట్ లుక్..

279
samantha
- Advertisement -

స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్యతో క‌లిసి మ‌జిలీ సినిమాలో న‌టిస్తుంది. పెళ్లైన త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న మొద‌టి సినిమా కావ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈమూవీని నిన్ను కోరి మూవీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీతో పాటు కొరియ‌న్ సినిమా మిస్ గ్రానీ రీమేక్ లో కూడా న‌టిస్తుంది. నందిని రెడ్డి ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. తెలుగులో ఓ బేబీ అనే టైటిల్ తో తెర‌కెక్క‌నుంది.

samantha

ఇటివ‌లే సమంత న‌టించిన సినిమాల‌న్ని బ్లాక్ బాస్ట‌ర్ హిట్ల‌య్యాయి. తాజాగా స‌మంత ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్‌లో సామ్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతోంది ఈ బ్యూటీ. ఈ ఫొటోను 24 గంటల్లో దాదాపు 6 లక్షల మంది లైక్‌ చేశారు. ‘ది బెస్ట్‌ హీరోయిన్‌, సామ్‌ ఎంతో ప్రత్యేకం, బ్యూటీ ఇన్‌ బ్లాక్‌, అమేజింగ్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -