ఫుల్ సెక్యూరిటీలో మహేష్‌..!

93
maharshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా రెండు రోజుల క్రితం హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ కాగా సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసే పనిలో ఉంది టీమ్‌. పొల్లాచ్చి షెడ్యూల్‌ జరుగుతుండగా సెట్స్ నుండి ఓ వీడియో లీకవడం తాజాగా మరో ఫోటో లీకవడం,సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.