11 తీర్మానాలు ఆమోదించిన స్టాండింగ్ క‌మిటీ..

124

న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న గురువారం స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత‌, ప్ర‌శాంత్‌గౌడ్‌, స‌మీనా బేగం, మ‌హ్మ‌ద్ అబ్దుల్ రెహ‌మాన్‌, ఎం.డి మిస్‌-బా-ఉద్దీన్‌, మ‌హ్మ‌ద్ అఖిల్ అహ్మ‌ద్‌, షేక్ హ‌మీద్‌, స‌బేహా బేగం, ఆర్‌. శిరీష‌లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు హ‌రిచంద‌న‌, విశ్వ‌జిత్ కంపాటి, కెన‌డి, విజ‌య‌ల‌క్ష్మి, సిక్తాప‌ట్నాయ‌క్‌, శ్రీ‌నివాస్‌రెడ్డిలు, సురేష్‌, జియాఉద్దీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో 11 ఎజెండా అంశాల‌ను ఆమోదించారు.

ghmc

స‌మావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఇవే..

1- ప్ర‌తి డివిజ‌న్ కార్పొరేట‌ర్‌కు ప్లే, స్పోర్ట్స్ మెటిరీయ‌ల్‌కై ల‌క్ష రూపాయ‌లు వినియోగించుకునేందుకు ఆమోదం.
2- స‌రూర్‌న‌గ‌ర్ స‌ర్కిల్ 5 కొత్త‌పేట వార్డు నెంబ‌ర్ 21లో వివిధ కాల‌నీల్లో సిసిరోడ్ల నిర్మాణానికి రూ. 2.79 కోట్ల మంజూరుకు ఆమోదం.
3- ఇంటిగ్రేటెడ్ మున్సిప‌ల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ కింద జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో చేప‌ట్టే ప‌నుల‌కు జిఎస్‌టి, ఇత‌ర ప‌నుల నిమిత్తం రూ. 527.67 కోట్ల‌తో చేప‌ట్టే ప‌నుల‌కు ప్ర‌భుత్వ ఆమోదంకై ప్ర‌తిపాద‌న‌లు పంపుట‌కు ఆమోదం.
4- ప్ర‌స్తుతం న‌గ‌ర ప‌రిధిలో ఉన్న 221 ట్రాఫిక్ సిగ్న‌ళ్ల‌కు అద‌నంగా పోలీస్ క‌మిష‌న‌ర్లు రూ. 30.41 కోట్ల అంచ‌నాతో స‌మ‌ర్పించిన 155 చోట్ల కొత్త ట్రాఫిక్ సిగ్న‌ల్ ఏర్పాటుకు క‌మిటి ఆమోదం.
5- మౌలాలి క‌మాన్ రెండు వైపులా 30 అడుగుల వెడ‌ల్పుతో రోడ్డు విస్త‌ర‌ణ‌కు స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం.
6- రూ. 4.95 కోట్ల‌తో షేక్‌పేట్‌లో మురుగునీటి మ‌ళ్లింపు, సాహ‌తం చెరువు అభివృద్ది ప‌నుల‌కు ఆమోదం.
7- జాతీయ నిర్మాణ సంస్థ నుండి టౌన్‌ప్లానింగ్ విభాగానికి వంద మంది సివిల్ ఇంజ‌నీరింగ్ గ్రాడ్యుయెట్ సేవ‌ల‌ను మ‌రో సంవ‌త్స‌ర కాలానికి వినియోగించుకునేందుకు ఔట్‌సోర్సింగ్ సేవ‌ల‌కై క‌మిటి ఆమోదం.
8- వార్డు 11 బాలాజిన‌గ‌ర్ డివిజ‌న్ మూసాపేట స‌ర్కిల్ 23లో పిపిపి ప‌ద్ద‌తిలో పార్కు అభివృద్దికి ఆమోదం.
9- కాప్రా ఊర చెరువు అలుగు ప‌క్క నుండి మురుగునీటి మళ్లింపు పైప్‌లైన్ నిర్మాణానికి ఆమోదం.
10- జిహెచ్ఎంసిలోని ఔట్‌సోర్సింగ్ వ‌ర్క‌ర్లు, ఆప‌రేట‌ర్ల ఇ.పి.ఎఫ్‌, ఇఎస్ఐ రికార్డుల నిర్వ‌హ‌ణ‌కు బిడ్డింగ్‌ల‌ను పిలిచేందుకు ఆమోదం.
11- జీడిమెట్ల, ఫ‌తుల్లాగూడ‌ల‌లోని సి అండ్ డి వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ ప్లాంట్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌స్తుతం ఉన్న రూ. 3కోట్ల నుండి రూ. 6కోట్ల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రానికి ప్లాంట్‌కు మంజూరు చేసేందుకై ఆమోదం.