రిజర్వేషన్లు… కొత్త భూమిక

209
Stalin hails KCR over increasing reservation
- Advertisement -

రిజర్వేషన్లు… దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రాజ్యాంగ హక్కులు. ఈ ప్రాతిపదికనే తెలంగాణ ప్రభుత్వం సామాజిక పరిస్థితుల ఆధారంగా విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని  నిర్ణయించింది.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అభ్యర్థించారు. అన్నిపార్టీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్దమైంది.

ఈ క్రమంలో ఉహించని విధంగా రిజర్వేషన్ల పెంపునకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మద్దతు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకే ఉండాలన్న  కేసీఆర్‌ ఆలోచన సరైందనేని…జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా విజయవంతం కావాలని స్టాలిన్‌ ఆకాంక్షించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌.. స్టాలిన్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రాల హక్కుల సాధనంలో మద్దతుగా నిలిచినందుకు స్టాలిన్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

stalin kcr

సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ మద్దతు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకేతో పొత్తుతో లాభపడదామనుకున్న బీజేపీ..అనూహ్యంగా తన ఎజెండాను మార్చింది. డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన మోడీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీయడంతో పాటు ఆపార్టీతో పొత్తుపై పరోక్ష సంకేతాలను ఇచ్చారు. ఈ క్రమంలోనే స్టాలిన్ తీసుకున్ననిర్ణయంతో తెలంగాణకు మార్గం మరింత సుగమం అయ్యేఅవకాశం ఉంది.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించడం లేదు. సమగ్ర డేటాతో ముందుకువెళుతోంది. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంలో తేల్చుకునేందుకు సిద్దమైంది.రిజర్వేషన్లు  50 శాతానికి మించవద్దనే సుప్రీం తీర్పు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తమవాదనాలు బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తమిళనాడు రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్న అంశాన్ని గుర్తుచేయనుంది.అంతేగాదు వివక్షకు, అణచివేతకు గురైన వర్గాలను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పరిమితులు లేవని రాజ్యాంగం(ఆర్టికల్‌ 46) స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని కూడా  ప్రతిపాదించనుంది. తమిళనాడు తర్వాత  చత్తీస్‌ గఢ్‌ – 58 శాతం, మహారాష్ట్ర – 52 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌ ,మేఘాలయ ,నాగాలాండ్‌,మిజోరం రాష్ట్రాల్లో  80 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తుచేయనుంది.

వాస్తవానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల అంశాన్ని కొత్తగా తెరమీదకు తీసుకురాలేదు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్టీలకు 12 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొంది. అంతేగాదు  ఉద్యమ సమయంలో, ఎన్నికల సభల్లో వందలసార్లు ప్రకటించింది.

తాము మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రధానమంత్రి మోడీ వద్ద ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేస్తు బీజేపీ వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు.మొత్తంగా రాష్ట్రాలకు హక్కులు కల్పించాలన్న కేసీఆర్‌ డిమాండ్‌కు త్వరలోనే మరిన్ని రాష్ట్రాలు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -