పెళ్లిలో హన్సిక డ్యాన్స్ హంగామా

243
hansika
- Advertisement -

చైల్డ్ యాక్ట‌ర్‌గా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసి అగ్ర క‌థానాయికల స‌ర‌స‌న చేరిన‌ బ్యూటీ హ‌న్సిక‌. తెలుగులో `దేశ‌ముదురు` చిత్రంతో హీరోయిన్‌గా చేసి న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే కొట్టేసింది ఈ అమ్మ‌డు. త‌రువాత హీరో రామ్‌తో జ‌త‌క‌ట్టి `మ‌స్కా, కంద‌రీగ` వంటి హిట్ సినిమాల‌తో హన్సిక‌కు క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ లో తన ట్యాలెంట్ కు తగ్గ అవకాశాలు దక్కించుకోవడంలో ఫెయిల్ అయినా.. తమిళ్ లో మాత్రం టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది హన్సిక మొత్వానీ.

Hansika

అయితే తాజాగా అమ్మడు తన సోదరుడి పెండ్లి వేడుకలో సందడి చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేస్తూ అంద‌రినీ అల‌రించింది. పంజాబీ సంప్రదాయం ప్రకారం త‌న సోద‌రుడి పెళ్లి జ‌రుగుతుండ‌గా తీసిన ఫొటోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. తన వదినను కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌యిన‌ట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన హన్సిక మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ‌ ప్రభుదేవాతో కలిసి ఓ తమిళ సినిమాలో న‌టిస్తోంది.

- Advertisement -