డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్‌..

255
Stalin
- Advertisement -

డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఎన్నికయ్యారు. బుధవారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప‍్రతిపక్ష నేతగా, డీఎంకే పార్టీ కోశాధికారిగా కొనసాగుతున్న స్టాలిన్‌ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడు కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురౌతుండడంతో…ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధి అనారోగ్యానికి గురైన నాటినుంచి పార్టీ బాధ్యతలను స్టాలినే నిర్వర్తిస్తున్నాడు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతను కూడా స్టాలినే మోశారు. తన రాజకీయ వారసుడు అయ్యే లక్షణాలు స్టాలిన్‌కు ఉన్నాయంటూ కరుణానిధి ఇప్పటికే అనేక సార్లు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Stalin

అస్వస్తత కారణంగా కరుణానిధి లేకుండానే సర్వసభ్య సమావేశం ముగిసింది. డీఎంకే రాజ్యసభ సభ్యురాలు, కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి, పెద్దకుమారుడు అళగిరి కూడా సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు అయ్యారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ మాట్లాడుతూ…తనకు పదవి ముఖ్యం కాదని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధానమన్నారు. తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ‍్ఞతలు తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని కీలక తీర్మానాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు. జల్లికట్టుపై నిషేదం ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరింది. తమిళ మత్స్యకారుల్ని..వారి పడవలని శ్రీలంక ప్రభుత్వం వదిలిపెట్టాలని తీర్మానించింది. పెద్దనోట్లకు వ్యతిరేకంగా తీర్మానించింది.

- Advertisement -