ఏపీ రాజకీయాలు వైసీపీ వర్సెస్ జనసేనగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల పవన్ – సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్‌గా చేసిన సన్నివేశాలు హైలైట్‌గా నిలవగా అగ్నికి ఆజ్యం పోసినట్లు రెండు పార్టీల మధ్య మాటల తూటాలు తారస్ధాయికి చేరాయి.
ఇక తాజాగా జనసేన నాయకులు ఒక అడుగు ముందుకేసి సందులో సంబరాల శ్యాంబాబు(SSS)పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ముహుర్తపు షాట్‌తో పాటు ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు.
ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఇద్దరిని ముంబయి రెడ్ లైట్ ఏరియా నుంచి తీసుకొస్తామని తెలిపారు. రెడ్ లైట్ ఏరియా నుంచి రాక పోతే కలకత్తా.. చాందినీ గంజ్ నుంచి హీరోయిన్లను తీసుకొస్తామన్నారు. జగ్గూ బాయి సమర్పణలో సినిమాను రూపొందిస్తామన్నారు. ఇప్పటికైనా రాంబాబు తన పద్దతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో xxx రాంబాబు అనే సినిమా కూడా తీస్తామని హెచ్చరించారు.