SSMB29:మహేష్‌తో ప్రియాంక స్పెషల్ సాంగ్!

14
- Advertisement -

మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేసుకుంది.

పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాపై అంచనాలు ఇపుడు నెలకొన్నాయి. సినిమాను శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు రాజమౌళి.

జక్కన్న ప్రస్తుతం మహేష్ మరియు ప్రియాంక చోప్రాపై ఓ గ్రాండ్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారట. ఇక ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ టాకీ పార్ట్ తో సినిమా మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది.

Also Read:AP:ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -