రెండు పార్టులుగా SSMB29!

7
- Advertisement -

SSMB29 సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతుండగా సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా యూనిట్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఇటీవల దర్శకుడు రాజమౌళి, నిర్మాత KL నారాయణ, టీమ్ కలిసి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముడవాడీని కలిసినట్లు సమాచారం. ఆయన ఈ సినిమా 120 దేశాల్లో విడుదల కానుంది.

కొన్ని వారాల క్రితం రాజమౌళి ప్రకటించిన ప్రకారం, సినిమా ఫస్ట్ లుక్ నవంబర్ 2025లో విడుదల కానుంది. ఈ అప్‌డేట్‌తోనే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

Also Read:తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష

- Advertisement -