SSMB28:మహేష్ టైటిల్ లీక్

34
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్ర శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28 కి సంబంధించి కొన్ని నెలలుగా ఎలాంటి అ డేట్ లేదు. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఉగాది కి లుక్ లేదా టైటిల్ వస్తుందని ఊహించిన మహేష్ ఫ్యాన్స్ నిరాశే మిగిలింది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ లీకైంది. “అమరావతికి అటు ఇటు” అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నిజానికి ఈ లీక్ వెనుక సినిమా టీం నే ఉందా ? లేదా ఫ్యాన్స్ ఎవరైనా టైటిల్ తెలుసుకొని లీక్ చేశారా ? తెలియాల్సి ఉంది. ఈ సినిమా కోసం ముందు నుండి త్రివిక్రమ్ అ అక్షరంతోనే ప్రారంభమయ్యే టైటిల్స్ పరిశీలిస్తున్నాడు. దీంతో ఇప్పడు లీకైనా టైటిల్ ను ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. శ్రీరామ నవమి రోజు టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరి అమరావతికి అటు ఇటు అంటూ త్రివిక్రమ్ ఏం చెప్పబోతున్నాడు ? ఈ క్లాస్ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా ? మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -