రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB29(వర్కింగ్ టైటిల్). దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నడుస్తోంది. సిమిలిగుడకు సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ తదితర ప్రాంతాల్లో నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా రాజమౌళితో పాటు మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా అక్కడి ప్రజలతో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం. మహేష్ సరసన ప్రియంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read:వేసవి రిలీజ్ సినిమాల లిస్ట్ ఇదే!

