SSMB29..క్రేజీ అప్‌డేట్?

13
- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు లెజెండరీ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలసి చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం SSMB29(వర్కింగ్ టైటిల్‌) భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేష్ బాబు చేసే అడ్వెంచర్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ భారీ సీక్వెన్స్‌ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:Pahalgam Attack:ఉగ్రవాదుల ఊహా చిత్రాలు

ఇందులో మహేష్ బాబు ఏకంగా డైనోసర్‌తో ఫైట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలోని అడవి నేపథ్యంలో సాగే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే అభిమానులకు పండగే. మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -