మహేశ్ 28…అప్‌డేట్!

26
mahesh
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్ బాబు కాంబోలో హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేశ్ కెరీర్‌లో 28వ సినిమా కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌లో సెట్స్ మీద‌కు వెళ్ళ‌నుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. కాగా ఇటీవ‌లే ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఎస్‌.ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

గ‌తంలో వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ క‌ల్ట్ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్ద‌రూ క‌లిసి #SSMB28తో హ్య‌ట్రిక్‌కు రెడీ అవుతున్నారు.

- Advertisement -