మహేష్ , త్రివిక్రమ్ ఇంత స్పీడా?

22
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఖలేజా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో SSMB28 పై భారీ అంచనాలున్నాయి. కొన్ని నెలల నుండి వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకొని సినిమాను తీస్తున్నాడు. మహేష్ కూడా ఇప్పటికే త్రివిక్రమ్ కి టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది.

అయితే త్రివిక్రమ్ కాస్త స్పీడున్న దర్శకుడే కానీ కొన్ని సార్లు స్లో అండ్ స్టడీగా వెళ్తుంటారు. ఈసారి మాత్రం జెట్ స్పీడుతో సన్నివేశాలు తీస్తున్నాడట. ఇప్పటికే 30 శాతం ఘాట్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ కల్లా ఒక పాట , ఫైట్ బ్యాలెన్స్ ఉంచి మిగతా వర్క్ అంతా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట.

హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే , శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. భారీ ఇంటి సెట్ వేసి అందులో కొన్ని ఫ్యామిలీ సీన్స్ తీస్తున్నాడు త్రివిక్రమ్. మరి ఇదే స్పీడు కంటిన్యూ చేస్తే సినిమా ఆగస్ట్ లో థియేటర్స్ లోకి వచ్చేయడం ఖాయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -