బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి దాని సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి -2 సృష్టించిన సునామీకి ఇండియన్ సినిమా రికార్డులన్ని బ్రేకయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డుకు రాజమౌళిని ఎంపికచేసినట్లు నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. సినీ రంగానికి చేసిన అధ్బుతమైన సేవలకు గాను ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 4గంటల 30నిమిషాలకు శిల్పకళావేదికలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా జక్కన్నకు ఈ అవార్డు ఇవ్వనున్నామని నాగార్జున పేర్కొన్నాడు.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి అతితక్కువ కాలంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఇప్పటివరకు ఫ్లాపేలేని దర్శకుడిగా విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు.
#ANRaward2017 pic.twitter.com/k8BGutgIZR
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 8, 2017