అవతార్ 2 దర్శకుడి పై జక్కన్న ట్వీట్

23
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఐతే, తాజాగా ఈ సినిమాకు మరో 2 అవార్డులు వచ్చాయి. ‘క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్’ లో భాగంగా ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’, ‘బెస్ట్ సాంగ్'(నాటు నాటు) అవార్డులు దక్కాయి. లాస్ ఏంజెలెస్ ఫిల్స్మ్ క్రిటిక్స్ అసోసియేషన్(LAFCA), ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును కీరవాణికి అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. ఇదే ఊపులో ఆస్కార్ కూడా తీసుకురావాలని ఫ్యాన్స్ అంటున్నారు.

మొత్తానికి దర్శదీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ అప్పట్లో తగ్గేలా లేదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ బరిలోనూ ఏదైనా అద్భుతం సృష్టిస్తుందా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. తాజగా హాలీవుడ్‌ దిగ్గజ ఫిల్మ్‌మేకర్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌(76)ను కలిశాడు జక్కన్న. ‘ఐ జస్ట్‌ మెట్‌ గాడ్‌’ అంటూ తన భావాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. అలాగే అవతార్-2 డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ పై రాజమౌళి ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు.

రాజమౌళి సోషల్ మీడియా వేదికగా.. ‘గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ మూవీని చూశారు. ఆయన ఇష్టపడి చూడటమే కాకుండా ఆయన భార్య సుజీకి కూడా రిఫర్ చేశారు. ఆమెతో కలిసి మళ్లీ సినిమా చూశారు. సార్ మీరు మా సినిమా చూడటమే కాకూండా మాతో 10 నిమిషాలు గడిపారు. నాకు ఎంతో ఆనందంగా ఉందని పోస్ట్ షేర్ చేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి…

వీరయ్య సక్సెస్ పై చిరు స్పందన

సుమకు చుక్కలు చూపించిన చిరు!

‘వారసుడు’ హిట్టా ? ఫట్టా ?

- Advertisement -