‘ డాక్టర్ ‘బాద్ షా..

211
SRK receives honorary doctorate
- Advertisement -

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ఖాన్‌కు మరో గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ వర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఉర్దూ వర్శిటీ ఆరో స్నాతకోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

హైదరాబాద్ లో డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉందని షారుక్‌ తెలిపారు. స్వాతంత్రోద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్నారు షారుక్. విద్య, ఉర్దూ భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తన తల్లి హైదరాబాద్‌లో జన్మించిందని.. తన తండ్రి ఉర్దూ పండితుడన్నారు‌. ఎదుటి వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని.. జీవితంలో ముందుకెళ్లేటప్పుడు ఒక్కోసారి తల వంచాల్సి వస్తుందన్నారు షారుక్. విద్య, ఉర్దూ భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

SRK receives honorary doctorate

టైప్‌ రైటర్‌లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడం కష్టం. అందుకే టైప్‌ చేసే సమయంలో ఆలోచించి జాగ్రత్తగా టైప్‌ చేయాలి. అదేవిధంగా జీవితంలో ఏం చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. ఏదైనా తప్పు చేశాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిది’ అని షారుక్‌ అన్నారు. యూనివర్సిటీ అధికారులు, సిబ్బందికి షారుక్‌ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -