అప్పుడే ఐటం సాంగ్స్ చేస్తా:శ్రియా

540
shriya saran
- Advertisement -

ఐటం సాంగ్స్ విషయంలో తాను ఫుల్ క్లారిటీతో ఉన్నానని తెలిపింది హీరోయిన్ శ్రియా సరన్. లాక్ డౌన్ నేపథ్యంలో భర్తతో కలిసి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతోంది.

ఈ సందర్భంగా సినిమాల్లో ఐటం సాంగ్స్‌ విషయంలో తాను ఫుల్ క్లారిటీతో ఉన్నానని వెల్లడించింది. సినిమాలో స్పెషల్ సాంగ్‌కి ప్రాధాన్యం ఉండి…సినిమాకి అది ప్లస్ అవుతుందంటే ఐటం సాంగ్ చేయడానికి తాను సిద్ధమేనని తెలిపింది.

తాను స్పెషల్‌ సాంగ్స్‌ చేసే సమయానికి హీరోయిన్లు ఎవరూ అలాంటి పాటలు చేయడం లేదు. అవి చేస్తే తిరిగి హీరోయిన్‌గా అవకాశం రాదేమోనని భయపడేవారురని కానీ తాను ఆ ట్రెండ్‌ని మార్చేశానని తెలిపింది శ్రియా. స్పెషల్‌ సాంగ్స్‌ చేసినా హీరోయిన్‌గా మనలో సత్తా ఉంటే తప్పకుండా అవకాశాలొస్తాయని తెలిపింది.

కొంతమంది దర్శక,నిర్మాతలు తనకు చెప్పే కథ ఒకటిగా వారు తీసేది మరొకటిగా ఉంటోంది. అలాంటి అనుభవాలు ఇటీవలి కాలంలో నాకు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అందుకే పూర్తి కథతో వస్తేనే సినిమాకు ఓకే చెబుతున్నాను అని తెలిపింది.

- Advertisement -