తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నవంబరు 25న పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.
తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల వినాయక స్వామి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముందుగా కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, గోవిందరాజస్వామివారి ఆలయం, ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు.
టిటిడి డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, విఆర్ శాంతి, ఎస్ఇ మనోహర్, విజివో గిరిధర్, ఆలయ అర్చకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read:Modi:జంగిల్ రాజ్‌తో ఖజానా లూటీ

