TTD:లక్కీడిప్‌లో శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు

4
- Advertisement -

ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు బుధవారం టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు గురువారం ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయించబడుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తూ,ఆన్ లైన్ లో ఉంచబడుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్ లో రూ.500/- డిపాజిట్ చేయవలసి ఉంటుంది. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చు.

లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500/- డిపాజిట్ ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది.తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీ డిప్ లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి, వారు చెల్లించిన రూ.500/- డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదు మరియు అంగప్రదక్షిణకు అనుమతించబడరు.

Also Read:న్యాయం గెలిచింది: మాజీ ఎంపీ సంతోష్ కుమార్

- Advertisement -