శ్రీశైలంలో 7వ రోజు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

525
Srisailam Mallanna
- Advertisement -

జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహక్షేత్రంలో ఐదవరోజు దసరా నవరాత్రి మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి రాత్రి 7 : 30 గంటలకు శ్రీశైల భ్రమరాంబాదేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది ఆది దంపతులైన శ్రీ భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జునస్వామివారిని గజావాహణంపై ఆవహింపచేశారు మొదటిగా అమ్మవారి అలంకార రూపమైన కాళరాత్రి అమ్మవారికి అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను గజావాహణం పై ఆవహింపచేసి అర్చకులు వేదపండితులు మంత్ర పుష్పాలతో పూజించి హారతులిచ్చారు.

మనోహరశోభతో గజావాహణం పై కొలువుదీరిన శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని చూసి పులకించి పోయిన కళాకారులు తమ ఆటపాటలు నృత్యాలు మేళతాళాలతో సందడి చేసి అలరించారు ముక్కంటి మురిసి పోయేటట్లు చిన్నారి బాలికలు ముద్దు ముద్దుగా కోలాటాలు చేసి భక్తులను మంత్రముగ్ధులను చేశారు గంగాధర మండపం నుంచి అంకాలమ్మ గుడి వీరభద్రస్వామి దేవాలయం వరకు స్వామిఅమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు నీరాజనాలర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

- Advertisement -