క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమాల్లో ఛాన్స్‌ల కోసం అమ్మాయిలను వాడుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నటి శ్రీరెడ్డి. తనకు న్యాయం చేయకపోతే ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నిరసన తెలియజేస్తా అని చెప్పిన శ్రీరెడ్డి అన్నంత పనిచేసింది. శనివారం హైదరాబాద్‌లో ఫిల్మ్ ఛాంబర్ వద్ద పై వస్త్రాలను పూర్తిగా తొలగించి.. అండర్ వేర్‌తో నిరసన తెలిపింది. మాలో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేయగా… శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
తన నిరసన మళ్లీ ఇలాగే కొనసాగుతుందని తెలుగు అమ్మాయిలకు ఎందుకు మాలో సభ్యత్వం ఇవ్వడం లేదని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ఒక సినిమా తీసిన వారికే మా కార్డులు ఇస్తే…మూడు సినిమాలు తీసిన తనకు ఎందుకు కార్డులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మాలో పెత్తందారి తనం నడుస్తోందని తెలిపింది. ఎంతమంది చచ్చిపోతే దారికి వస్తారో చెబితే…కనీసం నేను చావడానికైనా సిద్ధమని తెలిపింది. పెద్ద పెద్ద నిర్మాతలకు బట్టలు విప్పి చూపించామని …ఇక జనాలకు చూపిస్తే ఓ దరిద్ర్యం పోతుందని చెప్పింది.
తనను అవకాశాల పేరుతో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వాడుకున్నారని.. కేవలం తెలుగు అమ్మాయి అనే కారణంతో అవకాశాలు లేకుండా చేశారంటూ ఇటీవల మీడియాకెక్కింది శ్రీరెడ్డి. తనతో పాటు చాలా మంది తెలుగు అమ్మాయిల్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని.. వాళ్ల కమిట్మెంట్స్‌కి ఒప్పుకోకపోతే ఆఫర్స్ లేకుండా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ శ్రీరెడ్డి పోరాటం చేస్తోంది. కొంతకాలంగా తనతో అసభ్యంగా ప్రవర్తిస్తు వచ్చిన వారి ఫోటోలను వివరాలను ఫేస్ బుక్ వేదికగా బయటపెడుతువస్తోంది.
ఇటీవల ఓ బడా ప్రొడ్యుసర్‌లో పాటు.. ఓ దర్శకుడు, ఓ సింగర్, మరో హీరోకి సంబంధించిన లీక్స్‌ను శ్రీరెడ్డి లీక్స్ పేరిట తన ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసి సంచలనం రేపింది. తాజాగా తప్పు చేసినవాడు ఎవడైనా… రెడ్డి అయినా తాట తీస్తా… త్వరలో రెడ్డిగారి గానా భజానా ప్రసారమని పోస్ట్ పెట్టింది. అయితే ఈ గానా భజానా పేరుతో ఎవరి పేరు బయటపడెతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
https://youtu.be/l_cOBMLjWXs