- Advertisement -
భద్రాచలం శ్రీరార పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ప్రారంభం కాగా గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరై స్వామివారి తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామ.. జయరామ.. జయజయ రామ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. పట్టాభిషేకంలో వేదపండితులు శ్రీరామునికి రాజదండం,రాజముద్ర,శంఖం, చక్రాలతో కూడిన ఆభరణాలతో పట్టాభిషేకం చేశారు.
ఇక మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. దీంతో ముత్యాల తలంబ్రాలు సమర్పించిన తొలి సీఎస్‌గా రికార్డుల్లో నిలిచారు.
Also Read:‘మై డియర్ దొంగ’..లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం
- Advertisement -