- Advertisement -
ఎడతెరపిలేని వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 22 గేట్లు ఎత్తేసి మరీ నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 90,190 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 95,952 క్యూసెక్కులుగా ఉంది.శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద సోమవారం రాత్రి 10 గంటలకు 20,79,187 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం కూడా 18.70 అడుగులకు తగ్గింది. 17.75 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరుకోకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు.
- Advertisement -