ఆ నలుగురితో ‘మల్టీ స్టారర్’ మూవి

193
Sriram Aditya Multi-Starrer Movie
- Advertisement -

టాలీవుడ్‌ లో ఇప్పుడు నలుగురు హీరోలతో ఓ మల్టీ స్టారర్ మూవి రాబోతుంది. ఈ మూవీకి  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ‘భలేమంచి రోజు’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ దర్శకుడు. అదే ఊపులోమల్టీ స్టారర్ మూవీకి శ్రీకారం చుట్టేశాడు శ్రీరామ్‌. ఈ  మల్టీ స్టారర్ ని హీరోలు నారా రోహిత్,  సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది,లతో కలిసి రూపొందనుంది.

నలుగురు హీరోలతో సినిమా రాబోతోంది అని తెలియగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇదే క్రమంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీనువైట్ల క్లాప్ కొట్టడంతో  కొంతసేపటి క్రితమే ఈ సినిమా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి ‘శమంతకమణి’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.
 Sriram Aditya Multi-Starrer Movie
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా, మార్చి మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించనున్నాడు. ఇందులో నారా రోహిత్,  సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు.  ఈ నలుగురు హీరోలకి జోడీగా నలుగురు హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు.  ఇక ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు.

- Advertisement -