పరిశ్రమలో నాగార్జునకు బిజినెస్ మేన్ అని, కమర్షియల్ వ్యక్తి అని పేరుంది. అలాగే ఆయనది చాలా ఆలోచించే మనస్తత్వం కూడా. తనకు ఓ హిట్ ఇచ్చినా, బిజినెస్ లో కొంచెం మేలు చేసినా ఇలా ప్రతి దానికి నాగ్ కి ఓ లెక్క ఉంటుంది. దీనికితోడు నాగార్జున తన దర్శకులు, కథల ఎంపిక విషయంలో కూడా బాగా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అందుకే ఆయనకు హిట్ పర్సెంటేజ్ ఎక్కువే. కానీ ఈ మధ్య నాగార్జున జడ్జ్ మెంట్ లోపించింది అని, తన మార్క్ స్టైల్ ను ఆయన మిస్ అవుతున్నారు అని అంటున్నారు. పైగా నాగార్జున కి హిట్ దర్శకులు కూడా దొరకడం లేదు. అందుకే, ఓ ప్లాప్ దర్శకుడు నాగార్జున కి బాగా దగ్గరయ్యాడు.
నాగార్జునకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టే కథ ఉంది అంటూ ప్రస్తుతం నాగ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ దర్శకుడే శ్రీను వైట్ల. ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన శ్రీను వైట్ల కథ పట్ల నాగార్జున కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాడట. ఈ క్రమంలో నాగార్జునను శ్రీను వైట్ల బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తుంది. తరచుగా నాగ్ ను కలుస్తున్న శ్రీను వైట్ల సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. అయితే ఇది నాగార్జున కి పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీను వైట్ల ట్రాక్ రికార్డు చూసిన ఎవరైనా ఇదే అభిప్రాయం వెల్లడిస్తారు.
Also Read:ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!
దర్శకుడిగా వరుస డిజాస్టర్స్ ఇచ్చిన శ్రీను వైట్లతో నాగార్జున కు సినిమా అవసరమా అంటున్నారు. నిజానికి నాగార్జున లైన్ అప్ చాలా బాగుంటుంది. ప్రతిభ కలిగిన దర్శకులతోనే నాగార్జున సినిమాలు చేస్తాడు. ఇలాంటి వారితో చేసే చిత్రాలపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉంటారు. కానీ ప్లాప్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శ్రీను వైట్ల లాంటి దర్శకుడితో నాగార్జున సినిమా చేస్తే.. ఎవరు చూస్తారు?, మరి నాగార్జున ఈ మాత్రం కూడా ఆలోచించలేక పోవడం ఆశ్చర్యకరం.
Also Read:రెడీ అయిన జగన్..ఎమ్మెల్యేలకు గుబులు!