సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే కూడా సక్సెస్ కే చుట్టాలు ఎక్కువ. సక్సెస్ లో ఉంటేనే చుట్టూ పదిమంది ఉంటారు. అందుకే, ఒక్క ఫ్లాప్ అగాధంలోకి నెట్టేస్తుంది అని ఇండస్ట్రీ జనం తరుచూ చెబుతూ ఉంటారు. గతంలో పదుల సంఖ్యలో హిట్ ఇచ్చిన దర్శకులు కూడా ఓ అట్టర్ ప్లాప్ మూవీతో కృంగిపోయిన ఘటనలు ఉన్నాయి. వివి వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల పరిస్థితి నేడు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల కూడా ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. శ్రీను వైట్ల నుంచి సినిమా విడుదలై ఏళ్లు అవుతుంది.
హీరో రామ్ దగ్గర నుంచి మంచు విష్ణు వరకూ ఎవరూ శ్రీను వైట్లకు డేట్లు ఇవ్వలేదు. చాలా ఏళ్ళు మరో ఆఫర్ రాలేదు. ఓ స్టార్ హీరోని ఎలాగైనా ఒప్పించి ఓ భారీ ప్రాజెక్ట్ ను తన భుజాలకెత్తుకోవాలని శ్రీను వైట్ల పెద్ద యుద్ధమే చేశాడు. కానీ, ఏ స్టార్ హీరో రియాక్ట్ కాలేదు. కనీసం కథ వినడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు వసూళ్లు సాధించలేక ప్లాప్ ల్లో ఉన్న హీరో గోపీచంద్ తో సినిమా చేసే ధైర్యం చేశాడు శ్రీను వైట్ల. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలి అనేది శ్రీను వైట్ల ప్రయత్నం. కానీ బడ్జెట్ మాత్రం ఇవ్వడం లేదు.
Also Read:పిక్ టాక్ : వామ్మో ఇది అందాల అరాచకం
శ్రీను వైటల్ – గోపీచంద్ కాంబినేషన్ కాబట్టి, ఈ మూవీపై హైప్ ఎంతగా పెంచాలని ట్రై చేసినా.. ఎట్టిపరిస్థితుల్లో పెరగదు అని నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారట. కాబట్టి.. తక్కువ బడ్జెట్ లోనే సినిమా చేయాలని శ్రీను వైట్లకు కండిషన్ పెడుతున్నారట. ఈ క్రమంలోనే శ్రీను వైట్ల కష్టకాలం ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. మరి పరిమితుల మధ్య సినిమా ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.
Also Read:కరీనా బాగోతంపై కంగనా కామెంట్స్