గణితవేత్తల జీవితాధారంగా సినిమాలు…

28
- Advertisement -

గణిత శాస్త్రం అనగా మనకు ముందుగా గుర్తుకువచ్చేది అంకేలు. అంకేలలో ప్రధానమైనది సున్నా. సున్నా విలువను కనుగోన్నప్పటి నుంచి గణిత శాస్త్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గణిత శాస్త్రం వల్ల అంతరిక్ష ఖగోళ పరిశోదనలు వైద్యశాస్త్రంలో రసాయన భౌతిక శాస్త్రాల్లో నిష్ణాతులను తయారు చేసుకోగలుగుతున్నాము. ఇందుకు కారణం సున్నా… దీని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. మన భారతీయుడు..ఇదే కోవల్లోకి వచ్చేవారు కూడా ఉన్నారు మరికొంత మంది గణిత వేత్తలు. వారిలో ఆర్యభట్ట, వరాహమిహిరుడు రామానుజన్ శకుంతల దేవి లాంటి గొప్ప గణిత వేత్తలు కలిగి ఉన్న దేశం భారతదేశం. అయితే భారత ప్రభుత్వం డిసెంబర్‌22న గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల నుంచి పిల్లలకు గణితంపై మక్కువ పెంచుకునేలా ప్రోత్సహిస్తుంది. డిసెంబర్ 22 ప్రఖ్యాత గణితవేత్త శ్రీనివాసన్ రామానుజన్ జయంతి కూడా. గణిత శాస్త్రవేత్తల జీవితాధారంగా అనేక సినిమాలు వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే మనకు ప్రేరణ కల్పిస్తుంది. అవి ఎంటో చూద్దాం…

ది మ్యాన్‌ వూ నో ఇన్ఫీనిటి
శ్రీనివాస రామానుజన్ ఆధారంగా తీసిన సినిమా దిమ్యాన్‌ వూనో ఇన్ఫీనిటి…నేడు 135వ జయంతి. దిమ్యాన్‌ వూనో ఇన్ఫీనిటి సినిమాను స్లమ్‌డాగ్ మిలియనీర్ నటుడు దేవ్‌పటేల్ నటించారు. భారతీయ గణితవేత్తలలో గణితరంగంలో విశేషమైన సేవలు అందించిన వాళ్లో ఒకరు.

సూపర్ 30
బాలీవుడ్‌ కండలవీరుడు హృతికోరోషన్ నటించిన సూపర్‌ 30సినిమా భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు అయిన ఆనంద్ కుమార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈయన 30 నిరుపేద విద్యార్థులకు జేఈఈ ఆడ్వాన్స్డ్‌ పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చి విజయం సాధిస్తాడు. ఈ ప్రేరణతో ఎంతో మంది పేద విద్యార్థులు జేఈఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

శకుంతల దేవి
మానవ కంప్యూటర్‌గా ప్రసిద్ది చేందిన శకుంతాలదేవి భారతీయురాలు కావడం విశేషం. ఈమే కంప్యూటర్‌లు కూడా గణించడానికి వీలులేని లెక్కలను గణించి ది హ్యూమన్ కంప్యూటర్‌గా ప్రసిద్ది చేందింది. ఈమే జీవిత ఆధారంగా వచ్చిన సినిమా శకుంతాల దేవి. దీనిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు.

ది ఇమెటెటింగ్ గేమ్‌
అమెరికన్ గణిత శాస్త్రవేత్త అలాన్ ట్యూరింగ్ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా ది ఇమెటెటింగ్ గేమ్. ఇతను గణన సిద్దాంతానికి విశేషమైన కృషి చేశారు. అలాన్ ట్యూరింగ్ పాత్రలో హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌ ప్రధాన పాత్రలో నటించారు.

ఏబ్యూటిఫుల్ మైండ్
ప్రముఖ గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ జీవితాన్ని అధారంగా చేసుకొని తీసిన సినిమా ఏబ్యూటీఫుల్‌ మైండ్ సినిమా. హాలీవుడ్ నటుడు రస్సెల్‌ క్రోవ్‌ ఈ పాత్రలో నటించారు. ఈయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇతను ముఖ్యంగా గణిత రంగానికి వివిధ రకాల సేవలందించారు.

ఇవి కూడా చదవండి…

ఆ రీమేక్ లో నాని – విశ్వక్ సేన్?

రాశీఖన్నా క్రష్‌ ఎవరో తెలుసా?

త్వరలో సెట్స్‌పైకి కాంతార2..!

- Advertisement -