శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్..తప్పెవరిది..?

324
Srinivas Reddy Outrage On His Wife Sangeetha
- Advertisement -

తనకు న్యాయం చేయాలంటూ సంగీత చేస్తున్న దీక్ష శుక్రవారానికి ఆరోరోజుకు చేరింది. బోడుప్పల్‌లోని భర్త శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి వద్దే ఆమె ఆందోళన కొనసాగిస్తోంది. తనకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగుతుందని సంగీత స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో సంగీత భర్త శ్రీనివాస్‌ రెడ్డి, మరిది శ్రీధర్‌ రెడ్డి, అత్త, మామలు ఐలమ్మ, బాల్‌రెడ్డిలను  పోలీసులు  బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కాగా, అత్త ఐలమ్మకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.

మొదటి భార్య స్వాతి నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాస్‌ రెడ్డి  సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. సంగీతకు ఆడపిల్ల పుట్టడంతో ఆమెను  ఇంటి నుంచి గెంటేసి దేవీ జగదీశ్వరీ అనే మైనర్ అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సంగీత న్యాయపోరాటానికి దిగింది. అత్తింటి వారి అరెస్టులతో తనకు న్యాయం జరిగినట్లుగా భావించడం లేదని, సామాజికంగా, ఆర్ధికంగా తనకు భద్రత కల్పించాలని సంగీత కోరుతోంది.

Srinivas Reddy
సంగీతకు శ్రీనివాస్ రెడ్డి మూడో భార్య దేవీ జగదీశ్వరి,ఆమె తల్లి  మద్దతుగా నిలుస్తున్నారు. తనకు పందొమ్మదిళ్ళ వయస్సు ఉన్నప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి తెలుసునని, తన ఇంటికి వచ్చేవాడని అతనిని మూడో పెళ్లి చేసుకున్న దేవీ జగదీశ్వరి అన్నారు. తామిద్దరం శ్రీశైలంలో ఇటీవలే పెళ్లి చేసుకున్నామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డిని ఇప్పుడు వదిలేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దేవీ చెబుతోంది.

Srinivas Reddy
అయితే శ్రీనివాస్ రెడ్డి అకృత్యాలను చూసి కూడా దేవి మూడోపెళ్లి చేసుకోవడం అందరు తప్పుపట్టాల్సిన విషయం. అందులో దేవి మైనర్ కూడా. అన్ని తెలిసే పెళ్లి చేసుకున్నాని చెబుతున్న దేవి,ఆమె తల్లిదండ్రులు సంగీతకు జరిగిన అన్యాయంలో పరోక్షంగా పాత్ర పోషించినట్లే. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని రెండో భార్యను వేధింపులకు గురిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి…దేవికి కూడా ఆడపిల్ల పుడితే మరోపెళ్లికి సిద్దంకాడా..? అప్పుడు దేవి పరిస్ధితి ఏంటి..? అంటే అంతా తెలిసే తప్పుచేసినట్లే కదా.  మొత్తంగా శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్‌తో తప్పు చేస్తోంది ఎవరో(మనం) అనే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నట్లే కదా..?. ఇప్పటికైనా శ్రీనివాస్ రెడ్డి ఉదంతంతో భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

- Advertisement -