TSTDC చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకం..

823
Srinivas Gupta
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవెలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తాను నియమించినట్లు శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జరీ చేశారు. ఇయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్‌ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని శ్రీనివాస్‌ గుప్తా పేర్కొన్నారు. 

కాాగా, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉన్నారు. అలాగే ఆయన ఉప్పల ఫౌండేషన్‌ ను స్థాపించిన దాని ద్వారా ఎంతో మంది బీదలకు అండగా నిలిచారు. కరోనా లాక్‌డౌన్‌లో వలస కూలీలు,పేదలకు సేవలందించారు. సామాజిక బాధ్యతగా సేవాభావంతో ఎంతోమంది సాయం చేశారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

- Advertisement -