పతనం అంచున కాంగ్రెస్: బీఆర్ఎస్ నేతలు

8
- Advertisement -

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాలలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది…అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది …హామీల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కు నోటీసులు అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్ముతారని రేవంత్ రెడ్డి గతం లో చెప్పారు .ఇపుడు అవే అబద్దాలు చెబుతున్నారు…కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు …అటెన్షన్ డైవెర్ట్ రాజకీయమే కాదు ..గోదావరి నీళ్లు తెలంగాణ కు దక్కకుండా చేసే కుట్ర జరుగుతోంది
..మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా చేస్తే ఏపీ కి గోదావరి నీళ్లు తరలించే కుట్ర జరుగుతోంది ..పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలిపోతే విచారణ ఎందుకు చేయలేదు ?…ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ ప్రమాదం జరిగితే కమిషన్ లేదు ..సుంకి శాల కూలిపోతే కమిషన్ లేదు అన్నారు.

వట్టెం పంప్ హౌజ్ మునిగినందుకు కమిషన్ లేదు …కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇస్తారు ..పంజాబ్ రాష్ట్రాన్ని ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ ను దాటించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా ?..రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులు ఇస్తారా ?…ప్రజలే హామీల వైఫల్యం పై కాంగ్రెస్ కు నోటీసులు ఇస్తున్నారు …కేసీఆర్ కు కాదు మీరు నోటీసులు ఇచ్చింది ..ప్రతి తెలంగాణ రైతు కు నోటీసులు ఇచ్చారు …మేము ప్రజల దగ్గరకే వెళతాం…మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తుల కోసం ఒత్తిడి పెంచుతాం అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉంది అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. పాలన చేతకాక సమస్యలు పరిష్కరించడం చేత కాక కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు …కాళేశ్వరం ఓ సఫల ప్రాజెక్టు ..ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్టు చివరి ఆయకట్టు దాకా నీళ్లు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు యే కారణం …కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట పెంచితే రేవంత్ పరువు తీస్తున్నారు ..అందాల పోటీల తో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు …తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ బీ ఆర్ ఎస్
…అందాల పోటీల్లో విదేశీ వనితల కాళ్ళు కడిగి తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ..సీఎం సొంత గ్రామం లో చిన్న గుడి ప్రారంభం కోసం మంత్రివర్గం అంతా వెళ్ళింది అన్నారు.

Also Read:నోటిసులతో పైశాచిక ఆనందం: గంగుల

- Advertisement -