నోటిసులతో పైశాచిక ఆనందం: గంగుల

9
- Advertisement -

తెలంగాణ సమాజం నిన్న ఉలిక్కి పడ్డది ..తెలంగాణ సాధించిన కేసీఆర్ కు నోటీసులతో ప్రజలు బాధపడుతున్నారు అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇది యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసు ..కాళేశ్వరం ప్రాజెక్టు కింద పంటలు పండించుకున్న రైతులకు ఇచ్చిన నోటీసు …రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నోటిసు ఇచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడి గడ్డ బ్యారేజ్ కాదు ..అనేక పంపులు ,బ్యారేజ్ లు ,రిజర్వాయర్ల ,కాలువలు ,టన్నెల్స్ సమాహారం …మేడిగడ్డ 83 పియర్స్ లో మూడు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం విఫలమైనట్టేనా ?…మార్చి 13 ,2024 లో ఘోష్ కమిషన్ వేసి వంద రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడానికి గడువు పెట్టారు ..చాలా గడువుల పెంపు తర్వాత మే 31 లోగా రిపోర్టు ఇస్తామని ఘోష్ చెప్పారు ..ఇంకా ఎవరిని పిలవం విచారణ పూర్తయ్యిందని ఘోష్ స్వయంగా చెప్పరు ..రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకే ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్ ,హరీష్ రావు లకు నోటిస్ ఇచ్చారు …వారికి నోటీసులు చేరక ముందే మీడియా కు లీకు లిచ్చారు అన్నారు.

ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం ,కక్ష తో కూడుకున్నవి…ఇల్లు కట్టినపుడు బాత్ రూం లో లీక్ అయితే మొత్తం ఇల్లు కూలగొడుతామా ?…బస్సు టైర్ పాడయితే బస్సునే కాల పెడతామా ?…మేడిగడ్డ కు రిపేర్ చేయనందుకు రేవంత్ రెడ్డి మీద కమిషన్ వేయాలి …కేసీఆర్ తెలంగాణ సమాజం కోసం కాళేశ్వరం కట్టారు…గుల్జార్ హౌజ్ ప్రమాద ఘటన వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి చిల్లర రాజకీయాలు …కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ ల దందా ను దారి మళ్లించడానికే ఈ నోటీసులు …నోటీసుల పై స్పందన కు ఇంకా గడువు ఉంది …అందరితో చర్చించి విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు ..కేసీఆర్ వ్యక్తి కాదు ..ఓ శక్తి …తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుంది …తెలంగాణ లో సమైక్య పాలన నాటి రోజులు తేవాలనేదే రేవంత్ కుట్ర…తెలంగాణ ప్రాజెక్టులు ఎండబెట్టి ఆంధ్రా కు నీళ్లు మలపాలనేదే రేవంత్ కుట్ర …ఈ నోటీసులకు బెదరం అదరం అన్నారు.

Also Read:జగన్ వర్సెస్ రామానాయుడు

- Advertisement -