రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలసి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ని ఏర్పాటు చేయాలని కోరిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో జడ్చేర్ల శాసన సభ్యులు, మాజీ మంత్రి C. లక్ష్మారెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి,మహబూబ్ నగర్ , జడ్చేర్ల, బూత్పూర్ మున్సిపాలిటీ లను కలుపుతూ నూస్ డవలప్ మెంట్ అథారిటీ ని ఏర్పాటు చేయాలని కోరారు.
అంతర్జాతీయ విమానాశ్రయం , జాతీయ హై వే , ఇండస్ట్రియల్ సెజ్ లతో పాటు IT పార్క్ ఏర్పాటు కావడం వల్ల పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ని జెడ్చేర్ల, బూత్పూర్ మున్సిపాలిటీ లను కలుపుకొని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉంటుందని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్….. ముఖ్యమంత్రి కేసీఆర్ కి వివరించారు.