గౌడ సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి- శ్రీనివాస్ గౌడ్

207
Minister Srinivas Goud
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపురం కోట  పునర్నిర్మాణం కోసం 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. అందుకు సంబంధించిన జీవో నెంబర్ నెంబర్.18 కాపీ ప్రతులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీకి అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లే లక్ష్మణ్ రావు గౌడ్, ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, గౌడ సంఘం సీనియర్ నాయకులు చింతల మల్లేశం గౌడ్, నాచగోని రాజయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్య గౌడ్, గౌడ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బత్తిని లత గౌడ్,ప్రశాంత్ గౌడ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత భారీ వర్షాల వల్ల శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాలోని ఖిలాషపూర్‌లో నిర్మించిన కోట కొంత భాగం కూలిపోవడం జరిగిన నేపథ్యంలో టూరిజం, హెరిటేజ్ తెలంగాణ ఉన్నతాధికారులతో కలసి దెబ్బతిన్న కోట పరిసరాలను, కోటను పరిశీలించాం. కోట మరమ్మతుల కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దెబ్బతిన్న భాగాన్ని తిరిగి నిర్మించేందుకు 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాహించామన్నారు. అందుకు సంభవించన జీఓ ప్రతులను రాష్ట్ర గౌడ సంఘం నాయకులకు అందించమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గౌడల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు.

- Advertisement -