దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఎస్సీ-ఎస్టీ కమిషన్‌..

12
srinivas errolla

తెలంగాణ ఎస్టీ – ఎస్టీ కమిషన్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన ఎర్రోళ్ల…తెలంగాణ ఎస్సి- ఎస్టీ కమిషన్ లో ఉన్న విధానం దేశంలో ఎక్కడా లేదని రాజస్థాన్ సర్కారు మెచ్చుకుందన్నారు. దళిత వర్గాలకు చేయాల్సినవన్ని కమిషన్ ద్వారా చేశాము..ఇంకా చేయాల్సింది ఉందన్నారు.

కమిషన్ పరిధి ఆధ్వర్యంలో 17 డిపార్ట్మెంట్ లలో రివ్యూ లు నిర్వహించాం…ఇప్పటి వరకు కమీషన్ ఆధ్వర్యంలో 82 కోట్లకుపైగా పరిహారం ఇప్పించాం.. దేశంలోనే మొదటి స్థానంలో మనం ఉన్నామన్నారు. 13850 కేసుల్లో ఎస్సి- ఎస్టీ కమీషన్ ద్వారా న్యాయం చేయించగలిగాం…సమైక్య రాష్ట్రంలో ఎస్సి- ఎస్టీ కమిషన్ ద్వారా రిహాబిలిటేషన్ లేదు…సీఎం కేసీఆర్ నియోజవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి మా కమిషన్ ద్వారా అన్ని రకాల సహాయ సహకరం చేయించామన్నారు.

ఎకరం భూమి- కుటుంబానికి సహకారం దగ్గరుండి అందించాం…సమైక్యరాష్ట్రంలో ఎస్సి- ఎస్టీ కమిషన్ కు నీళ్ల బాటిల్ కొనే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. అధికారులకు భయం- భాదితులకు భరోసా కల్పించే విదంగా కమిషన్ కు రూపుదిద్దామని…ప్రతిరోజు ఎస్సి- ఎస్టీ కమిషన్ ను 300 మంది వరకు వస్తారని చెప్పారు. డైరెక్ట్ గా 7వేల కేసులు హైదరాబాద్ ఆఫీస్ కు ఫిర్యాదుల రూపంలో వచ్చాయి… అట్రాసిటీ కేసుల పై అవగాహన పెంచాం- కులంపేరుతో దూశించేందుకు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.