శరణం భజే అంటున్న డీజే..

410
- Advertisement -

సరైనోడు సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్టైలిష్ స్టార్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేగా రాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత బన్నీకోసం ప్రత్యేకంగా ఈ స్టోరీ రాసి దువ్వాడ జగన్నాథమ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 8 ప్యాక్ కూడా చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ పక్కా బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

DJ song Saranam Bhaje Bhaje

‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన ఈ సినిమా నుంచి ‘డీజే శరణం భజే’ అనే పాటను రిలీజ్ చేశారు. ఒకటిన్నర రోజులోనే ఈ పాట మిలియన్ మార్క్ ను అందుకుంది. యూత్ ను అలరిస్తూ .. ఆకట్టుకుంటూ ఈ పాట దూసుకుపోతోంది.

ఈ పాటకి 1,149,315 వ్యూస్ లభించగా .. 37,500 లైక్స్ పడ్డాయి. జొన్నవిత్తుల సాహిత్యం .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. విజయ్ ప్రకాష్ గానం ఈ పాటకి ఈ స్థాయి ఆదరణ లభించడానికి కారణమని చెప్పుకుంటున్నారు. డిఫరెంట్ లుక్స్ తో అల్లు అర్జున్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జూన్ 23న భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం, అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

https://youtu.be/JVPw-THFCCo

- Advertisement -