శ్రీముఖి మళ్లీ ఆశ పడుతుంది

62
- Advertisement -

గతంలో మోడ్రెన్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో సందడి చేసిన యాంకర్ శ్రీముఖి కొద్దిరోజులుగా పట్టు శారీస్, మోడ్రెన్ శారీస్ తో స్టయిల్ మార్చేసింది. షాప్ ఓపెనింగ్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. బట్టల షాప్ ల ఓపెనింగ్స్ కి వెళుతూ కంచిపట్టు శారీస్ కట్టుకుని వయ్యారాలు పోతుంది ఈ జూనియర్ రాములమ్మ. ఇప్పటివరకు శారీస్ తోనే ఫొటోస్ షూట్స్ షేర్ చేసిన శ్రీముఖి ఇప్పుడు మళ్ళీ పాత పంథాలోకి వచ్చేసింది. అంటే మళ్ళీ మోడ్రెస్ డ్రెస్ తో సొగసులు చూపించడానికి రెడీ అయ్యింది. మోడ్రెన్ అవుట్ ఫిట్ లో శ్రీముఖి అదరగొట్టేసింది.

మళ్ళీ పదహారేళ్ళ అమ్మాయిలా మారిపోయింది. 30 ప్లస్ లోనూ శ్రీముఖి అద్భుతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సినిమాలతో బిజీ కావాలని ఆశ పడుతుంది. అలాగే ప్యాన్ ఇండియా మూవీస్ తో నటించాలని టార్గెట్ పెట్టుకుంది. మరో వైపు యాంకర్ గా కూడా శ్రీముఖి చాలా బిజీగా ఉంటుంది. మొత్తానికి ప్రస్తుతం శ్రీముఖి సోషల్ మీడియాలో క్రేజీగా కనిపిస్తుంది. నిజానికి మొన్నటివరకూ శ్రీముఖి పని అయిపోయింది అని, ఆమెకు యాంకర్ గా కూడా అవకాశాలు తగ్గిపోతున్నాయని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే శ్రీముఖి క్రేజ్ కి తగ్గట్టు షోలు ఎనౌన్స్ కాలేదు.

ఈ లోపు తన ఇంటి ముందు దర్శకనిర్మాతలు టెంట్ వేసుకుని మరీ తనను తమ సినిమాల్లో బుక్ చేసుకుంటున్నారు అంటూ ఆ మధ్య శ్రీముఖి ఓవర్ గా మాట్లాడింది. కానీ, అంత ఓవర్ యాక్షన్ ఇచ్చి.. చివరకు మ్యాటర్ లేదు అని అందరికీ అర్ధం అయిపోయింది. ఐతే, ఇప్పుడు శ్రీముఖి మళ్లీ క్రేజీ బిజీ యాంకర్ గా మారిపోయింది. ఆమె డేట్లు కోసం మళ్లీ టీవీ నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇలాగే సినిమాల్లో కూడా బిజీ కావాలని శ్రీముఖి ఆశ పడుతుంది.

Also Read:ఫుల్ ఖుషి మోడ్ లో మహేష్ ఫ్యాన్స్

- Advertisement -