ప్రజల నిరసనతో దిగొచ్చిన శ్రీలంక అధ్యక్షుడు…

148
sl
- Advertisement -

శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. విదేవీ మారక నిల్వలు తగ్గిపోవడంతో శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నెలకొనగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుండి తీవ్ర నిరసన వస్తుండటంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దిగొచ్చారు.

దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. నిత్యావరస సరుకులు, విద్యుత్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నెల 30 నుంచి నార్వే, ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయాలను, ఆస్ట్రేలియాలోని తమ కాన్సులేట్ జనరల్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించింది. మందులకు కొరత ఏర్పడడంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

- Advertisement -