వరల్డ్ కప్ నుండి శ్రీలంక ఔట్!

3
- Advertisement -

ప్రపంచకప్‌లో సెమీఫైనల్ ఆశలు ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు కెప్టెన్ షనక దీర్ఘకాలిక మార్పులు అవసరమని పేర్కొన్నారు. కొలంబోలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక 61 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో శ్రీలంక టోర్నమెంట్ నుంచి తప్పుకుంది.

దేశం కోసం ఆడేటప్పుడు ఫిట్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని షనక అన్నారు. “ఫిట్‌నెస్ అనేది రాజీ పడలేని అంశం. గాయాల సమస్యల వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింటోంది. వనిందు హసరంగ, మతీష పతిరాణ, ఈషాన్ మలింగ వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపింది. ఇది సాకేమీ కాదు కానీ ఫిట్‌నెస్ సమస్యలు మళ్లీ మళ్లీ ఎదురవుతున్నాయి అని తెలిపారు.

దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా పెద్ద టోర్నమెంట్లలో స్థిరమైన ఫలితాలు సాధించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. జట్టు ఎంపికను మెరుగైన పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని చేసినప్పటికీ, ముఖ్యంగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో పరిస్థితులు ఆశించిన విధంగా లేవని చెప్పారు.

పవర్ హిట్టింగ్‌లో కొంత లోపం ఉన్నప్పటికీ, శ్రీలంక పరిస్థితులకు అనుగుణంగా ఆడటం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అభిమానులకు విజయం అందించలేకపోయామని క్షమాపణలు తెలిపారు. ప్రతికూల వాతావరణం ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందని షనక అన్నారు. అయినప్పటికీ మిగిలిన మ్యాచ్‌ను సానుకూలంగా ముగించి, తదుపరి టోర్నమెంట్‌కు ఉత్సాహం సంపాదించుకోవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..

- Advertisement -