క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ వివాహం మార్చి 5, 2026న ముంబైలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కుటుంబం జామ్‌నగర్‌లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను వైభవంగా నిర్వహించింది. ఆ వేడుకలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ తన కుమారుడి గురించి భావోద్వేగంగా మాట్లాడారు.
ఒక అబ్బాయి తన జీవిత భాగస్వామిని ఇంటికి పరిచయం చేసినప్పుడు, తండ్రికి తన కుమారుడు పెద్దవాడయ్యాడని నిజంగా అర్థమవుతుంది. అర్జున్ తనకు నచ్చిన తోడును ఎంచుకున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది” అని సచిన్ అన్నారు. తమ కుటుంబానికి సన్నిహితులైన అంబానీలు వేడుకలను అద్భుతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వధువు సానియా చందోక్ ప్రముఖ వ్యాపారవేత్త, గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘాయ్ మనవరాలు. ఆమె స్వతహాగా ఒక ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు పొందింది. గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరిగిన ఈ జంట పెళ్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , విపక్ష నేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులను సచిన్ స్వయంగా ఆహ్వానించారు.
Mrs Nita Ambani hosted the Tendulkar family and congratulated Arjun Tendulkar and Saaniya Chandhok on their upcoming wedding 🎉💐 pic.twitter.com/cTvla15eUa
— Reliance Industries Limited (@RIL_Updates) February 26, 2026

