ఆసియా కప్‌లో బోణి కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక…39 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమర విక్రమ(54), అసలంక(62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో లంక విజయం ఖాయమైంది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని భావించాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయం తప్పని మ్యాచు ప్రారంభమైన కాసేపటికే తెలుసుకున్నాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.హుస్సేన్ శాంటో(89) రాణించడంతో 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది బంగ్లా. 4 వికెట్లతో సత్తాచాటిన శ్రీలంక బౌలర్ మతీశ పధిరాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read:జబర్దస్త్ గడ్డం నవీన్ @25