చివరిచూపు కోసం భారీ జనం…కరోనా అని తెలిసి

189
coromavirus news
- Advertisement -

కరోనా నేపథ్యంలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు ముందు కరోనా తర్వాత అనేలా పరిస్ధితులు మారిపోయాయి. ఇక కరోనాతో ఎవరైనా చనిపోతే చివరి చూపు కూడా చూడలేని పరిస్ధితి నెలకొంది.

తాజాగా అలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఓ మహిళా అనారోగ్యంతో మరణించింది. చివరిచూపుకోసం పెద్ద ఎత్తున బంధువులు, స్ధానికులు తరలివచ్చారు.

అయితే ఆరోగ్యశాఖ అధికారులు ఆమె మృతదేహానికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ విషయాన్ని బంధువులకు తెలియజేయడంతో క్షణాల్లో ఎక్కడివాళ్లు అక్కడే జారుకున్నారు. దీంతో ఆరోగ్యశాఖాధికారులు, గ్రామంలోని పారిశుధ్యకార్మికులు, పంచాయితీ అధికారి దగ్గరుండి మహిళ మృతదేహానికి కరోనా నిబంధనల ప్రకారం ఖననం చేశారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

- Advertisement -