చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొన్నేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిరీష్ భరద్వాజ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఓ పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. వాస్తవానికి శ్రీజ పెళ్లి కంటే ముందే అతడు రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల అది ఆలస్యమైంది. ప్రస్తుతం చిరుకు పోటీగా బీజేపీలో చేరి రాజకీయంగా ఎదుగుదలకు మెట్లు వేసుకుంటున్న భరద్వాజ్.. త్వరలోనే శ్రీజకు, వారి కుటుంబానికి షాక్ ఇచ్చేలా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకోబోతున్నాడని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ శిరీష్ భరద్వాజ్‌ను శ్రీజ పెళ్లి చేసుకుంది. వీరి కొన్నాళ్లు వారి దాంపత్య జీవితం బాగానే ఉన్నా.. ఏమైందో ఏమో కానీ వారి జీవితంలో కలతలు మొదలయి విడాకులకు దారి తీసింది. ఆ తర్వాత శ్రీజ రెండో పెళ్లిచేసుకుంది. దీంతో తన పెళ్లి శ్రీజ దిమ్మ తిరిగేలా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడట.