పసికూనకు కోచ్‌గా శ్రీధరన్‌ శ్రీరామ్‌ నియామకం: బీసీబీ

54
sridharan
- Advertisement -

క్రికెట్‌ చరిత్రలో పసికూనగా పేరుపొందిన జట్టు బంగ్లాదేశ్‌. అలాంటి జట్టు గత కొద్ది సంవత్సరాలుగా తన ఆట తీరుతో ప్రపంచ మేటి జట్లను సైతం కంగుతినిపిస్తోంది. దానికి కారణం ఆ జట్టుకు ఉండే వెన్నెముక లాంటి కోచ్‌ ఉండటం వల్ల ఆది సాధ్యమవుతుంది. ప్రస్తుతం అలాంటి జట్టుకు భారత మాజీ ఆల్‌రౌండర్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ను కోచ్‌గా నియమించినట్లు బీసీబీ డైరెక్టర్‌ ధృవీకరించింది. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నియామకం చేపడుతున్నట్టు బీసీబీ ప్రకటించింది.

భారత్ తరపున 2000 నుంచి 2004 వరకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. సౌతాఫ్రికాతో నాగ్ పూర్ లో వన్డేల ద్వారా అరంగేట్రం చేశాడు. మొత్తం 8 వన్డేల్లో81 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 133 మ్యాచులు ఆడిన శ్రీరామ్‌ 9539 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు ఉండగా, 36 అర్థసెంచరీలున్నాయి. 15 టీ20ల్లో 233 రన్స్ సాధించాడు.

శ్రీధరన్ శ్రీరామ్ గతంలో ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా, స్పిన్ బౌలింగ్ కోచ్ కూడా పనిచేశారు. 2015 నుంచి ఆసీస్‌ జట్టుకు సహాయక కోచ్‌ గా పనిచేశారు. 2019లో యాషేస్‌ సీరిస్‌ ముగిసే నాటికి ఆసీస్ జట్టుకు డారెన్‌ లీమాన్‌ కు సహాయ కోచ్‌గా పనిచేశారు. 2016లో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి పలు ధఫాలుగా వివిధ ఫ్రాంచైజీలకు సహయక కోచ్‌గా పనిచేశారు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ టీమ్‌ సపోర్ట్ స్టాఫ్‌లో శ్రీరామ్‌ ఉన్నారు. ఆర్సీబీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడానికి ఈ మధ్యే ఆస్ట్రేలియా స్పిన్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -