శ్రీదేవి నటిస్తున్న చిత్రం మామ్. శ్రీదేవి భర్త బోనికపూర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం తల్లి, కూతురు మధ్య బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈసినిమా లో ద్విపాత్రాభినయం శ్రీదేవి నటిస్తుందన్ని సమాచారం. అయితే ఈ సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి
అయితే ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్‌ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఉరీ ఉగ్ర దాడుల తర్వాత భారత్- పాకిస్థాన్ పై సర్జికల్ దాడులు నిర్వహించడంతో ఇరు దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం సినిమాలపై పడింది.
పాక్ నటీ,నటులు ఉన్న సినిమాలను ఇండియాలో విడుదల కాకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తో పాటు పలు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన యే దిల్‌హై ముష్కిల్… సినిమాలో పాకిస్తాన్ నటీ,నటుల కారణంగా ఇప్పటికే చిక్కుల్లో ఉంది. ప్రస్తుతం శ్రీదేవి నటించిన మామ్ కూడా తాజాగా ఈ లెక్కల్లో చేరిపోయింది. మామ్ లో ఇద్దరు పాకిస్తానీ నటులు ఉన్నారు. శ్రీదేవి భర్తగా అద్నాన్ సిద్దిఖీ..కూతురుగా సజల్ ఆలీ నటిస్తున్నారు. వీరిద్దరు పాక్ నటుల కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడిందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్తు కొడుతున్నాయి. ఈ సినిమాకు శ్రీదేవి భర్త బోనీకపూరే కావడంతో ప్రస్తుతానికి ఈ సినిమాను సస్పెన్స్‌లో పెట్టి సైలెంట్‌గా ఉండటం మేలు అని బోనికపూర్ అనుకున్నట్లు సమాచారం.
మొత్తం మీద పాకిస్తాన్ నటీ,నటుల ప్రభావంతో ఇండియాలో పలు సినిమాలు ఆగిపోయే పరిస్థితి నెలకొంది.