భారత్‌-ఆస్ట్రేలియాల ఫైట్‌కు షెడ్యూల్‌ ఫిక్స్‌..

266
Online News Portal
India-Australia four-match Test series
- Advertisement -

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా త్వరలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. దాదాపు నెలరోజులకు పైగా జరిగే సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు కొత్త వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ షెడ్యూల్ వివరాలను భారత-ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

ఈ మేరకు ఫిబ్రవరి 23 వ తేదీన పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే తొలి టెస్టుతో ఇరు జట్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక రెండో టెస్టు మార్చి 4వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుండగా, మూడో టెస్టు మార్చి 16 వ తేదీన రాంచీ వేదికగా జరుగనుంది. ఇక చివరిదైన నాల్గో టెస్టు ధర్మశాలలో మార్చి 25వ తేదీన ఆరంభం కానుంది. చిన్న పట్టణాల్లోనూ టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకుగానూ ఇటీవల ఇండోర్‌, విశాఖపట్నం, పుణె, రాంచి, రాజ్‌కోట్‌, ధర్మశాల కొత్త వేదికలను భారత బోర్డు సిద్ధం చేసింది.

ఆస్ట్రేలియా చివరిసారి 2013లో భారత్ లో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగ్గా, ఆ సిరీస్ను భారత్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తరువాత 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో భారత్ వైట్ వాష్ అయ్యింది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -