శ్రీదేవి అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మరణించినప్పట్నుంచీ ట్విట్టర్ లో తన ఆవేదనను వ్యక్తంచేస్తూనే ఉన్నాడు వర్మ. శ్రీదేవి అంటే ఆయనకు ఎంత అభిమానమో చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
ఆమె నటించిన ఓ సాంగ్‌ను మైమరిచిపోయి నేల మీద కూర్చొని చూస్తుండగా తీసిన వీడియోను కూడా మనం కొంతకాలం క్రితం చూశాం. కాగా ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న శ్రీదేవి గురించి ఇదే నా లాస్ట్ ట్వీట్ అని చెప్పిన వర్మ..ఈ రోజు శ్రీదేవి అంతిమయాత్రను చూడగానే తన గురించి ట్వీట్ చెయ్యకుండా ఉండలేకపోయాడేమో. అందుకే వర్మ మళ్ళీ ట్వీట్ చేశాడు.
తాజాగా వర్మ శ్రీదేవి గురించి కంటతడి పెట్టించేలా ట్వీట్ చేశారు. ‘‘థియేటర్స్‌లో శ్రీదేవి అద్భుతమైన ఎనర్జీతో చేసే డ్యాన్స్‌ను, యాక్టింగ్‌ను చూసేందుకు జనం అలా కూర్చుండిపోయేవారు. అలాగే ఇప్పుడు కూడా ఆమె చుట్టూ జనం ఉన్నారు. కానీ కన్నీళ్లతో పగిలిన హృదయాలతో’’ అని వర్మ ట్వీట్ చేశారు.