శ్రీదేవి కూతురి సినిమా ఫస్ట్‌ లుక్‌..

195
- Advertisement -

అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవిని తెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని జనాలంతా ఎదురుచూస్తున్నారు. ఆ సందర్భం ఎంతో దూరం లేదులెండి. జాహ్నవి సినీ రంగంలోకి ‘ధఢక్’ అనే సినిమాతో అడుగుపెట్టబోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‎లుక్ కూడా విడుదలైంది. ఈ ఫస్ట్‎లుక్ పోస్టర్‎ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. జాహ్నవి కూడా తన ఇన్‎స్టాగ్రామ్ ద్వారా ఈ లుక్ పోస్ట్ చేసింది. ఇందులో హీరో హీరోయిన్లు రొమాంటిక్ లుక్‎తో దర్శనమిస్తుండటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Sridevi's daughter Jhanvi Kapoor 'Dhadak' Movie First Look
ఇషాన్ ఖట్టర్ హీరోగా జాహ్నవి హీరోయిన్‎గా వస్తున్న ఈ సినిమా మరాఠి చిత్రం ‘సైరాట్’ కి రీమేక్‎గా తెరకెక్కుతోంది. జీ స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -